కన్ఫ్యూజన్ లో పడ్డ కాంగ్రెస్?

65
- Advertisement -

తెలంగాణలో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ తెగ అరతపడుతోంది. గెలుపు కోసం అస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే ఇతర పార్టీలతో పాటు కలిసి పొత్తు ఏర్పరచుకోవడంపై దృష్టి సారించింది హస్తం పార్టీ. వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని ఈ మద్య వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. నిన్నటికి నిన్న కమ్యూనిస్ట్ నేతలతో కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం థాక్రే భేటీ అయ్యారు కూడా. ఈ భేటీతో పొత్తు కన్ఫర్మ్ అనే వాదన వినిపించింది. అయితే సీట్ల కేటాయింపు విషయంలో వామపక్షాలు చేసిన డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ కంగుతింది..

ఏకంగా నాలుగు సీట్లను తమ పార్టీల నేతలకు కేటాయించాలని కమ్యూనిస్ట్ పార్టీలు డిమాండ్ చేశాయట. ముఖ్యంగా మునుగోడు, కొత్తగూడెం, బెల్లంపల్లి అస్నాబాద్ నియోజిక వర్గాలను వామపక్షాలు కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ నాలుగు నియోజిక వర్గాల్లో హస్తం పార్టీ ఎంతో కొంత బలంగానే ఉంది. అయితే మునుగోడు, అస్నాబాద్ టికెట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ రెడీగానే ఉందట. ఎందుకంటే మునుగోడు బై పోల్ ఎన్నికల్లో హస్తం పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. అందువల్ల ఆ నియోజిక వర్గాన్ని వామపక్షలకు కేటాయిస్తే మంచిదనే ఆలోచనలో హస్తం నేతలు ఉన్నారట.

Also Read:కాంగ్రెస్ ” కాపీ క్యాట్ “?

అలాగే అస్నాబాద్ లో కూడా కాంగ్రెస్ బలం అంతంత మాత్రంగానే అందుకే మునుగోడు, అస్నాబాద్ నియోజిక వర్గాలను కేటాయించేందుకు సిద్దంగా ఉంది హస్తం పార్టీ. అయితే కొత్తగూడెం, బెల్లంపల్లి నియోజిక వర్గాలను కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కోరడంతో కాంగ్రెస్ పార్టీ కన్ఫ్యూజన్ లో పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ రెండు నియోజిక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎక్కువగానే ఉంది. దీంతో కొత్తగూడెం, బెల్లంపల్లి నియోజిక వర్గాలను వామపక్షలకు కేటాయిస్తే సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వామపక్షాలతో పొత్తు వామపక్షాలతో పొత్తు ఏర్పరచుకుంటుందా లేదా అనేది చూడాలి.

Also Read:కుసుమ జగదీష్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

- Advertisement -