ఆ స్థానాల్లో టికెట్ దక్కేదెవరికి ?

21
- Advertisement -

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై అధికార కాంగ్రెస్ దృష్టి సారిస్తోది. 17 స్థానాలకు గాను ఇప్పటికే 13 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ. మిగిలిన నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సిఉంది. పెండింగ్ లో ఉన్న స్థానాల్లో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరబాద్ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో నేతల నుంచి తీవ్రమైన పోటీ ఉండడంతో ఎంపిక తలనొప్పిగా మారింది. వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్య, నామిళ్ల శ్రీనివాస్ వంటి వారు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. మరి వీరిద్దరిలో ఎవరో ఒకరికి సీటు దక్కుతుందా లేదా వేరే వారికి సీటు కట్టబెడదతారా అనేది చూడాలి. ఇక కరీంనగర్ స్థానంపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. .

ఈ స్థానానికి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న వంటి వారు పోటీ పడుతున్నారు. వీరి ముగ్గురిలో సీటు ఎవరికి దక్కిన ఇతరుల నుంచి అసంతృప్త నినాదాలు చెలరేగే అవకాశం ఉంది. ఎందుకంటే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రెడ్డి వంటి వారు పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నవారు కావడం సీటు తమకే దక్కాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. ఇక తీన్మార్ మల్లన్న విషయానికొస్తే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. దాంతో పార్లమెంట్ ఎన్నికల్లో సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

ఇక ఖమ్మంలో డిప్యూటీ సి‌ఎం భట్టి విక్రమార్క సతీమణి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబీకులు టికెట్ ఆశిస్తున్నారు. దాంతో ఈ సీటును కూడా ఫైనల్ చేయడం కొంత కష్టతరమే. అటు హైదరాబాద్ సీటుపై కూడా ఇదే రీతిలో సస్పెన్స్ కొనసాగుతోంది. మరి పెండింగ్ లో ఉన్న ఈ స్థానాల్లో అభ్యర్థులను ఎన్నుకోవడం హస్తం పార్టీకి తలకు మించిన పనే అవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకపోతే ఈ నెల 31 న మరోసారి సీఈసీ సమావేశం జరగనుంది. దీంతో ఈ సమావేశం తరువాత పెండింగ్ లో ఉన్న స్థానాల్లో పోటీ చేసేదెవరనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read:సుహాస్ హీరోగా.. ‘ఓ భామ అయ్యో రామ’

- Advertisement -