Congress:డైవర్షన్ పాలిటిక్స్.. సెల్ఫ్ గోల్!

35
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందా ? ప్రతిపక్ష బి‌ఆర్‌ఎస్ ను ఇరికించే ప్రయత్నంలో సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా ? అంటే అవుననే చెప్పక తప్పదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతసేపు బి‌ఆర్‌ఎస్ పై విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తున్నారే తప్పా.. రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణ ఏంటనే దానిపై కాంగ్రెస్ పాలకులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. పదే పదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను చర్చకు తీసుకురావడం, కేఆర్ఎంబీ అప్పగింతలో ప్రజలను తప్పుదోవ పట్టించడం.. వీటితోనే సభ సమయాన్ని కాంగ్రెస్ వృధా చేస్తోందనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. .

ఏ హామీలైతే ప్రకటించి అధికారంలోకి వచ్చిందో ఆ హామీల విషయంలో కాంగ్రెస్ పాలకులు అసెంబ్లీలో ఏ మాత్రం చర్చించకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఆరు గ్యారెంటీల ప్రస్తావన లేకుండా వాటి నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు.. శ్వేతపత్రం అని, మేడిగడ్డ ప్రాజెక్ట్ లో తప్పులని ఇలా ఏవేవో కల్లబొల్లి కబుర్లు చెబుతూ ప్రతిపక్షంపై బురద చల్లే ప్రయత్నం చేశారు. శ్వేతపత్రం విడుదల చేసి గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు.

అయితే కాంగ్రెస్ ప్రవేశపెట్టిన శ్వేతపత్రం తప్పుల తడక అని మాజీ మంత్రి హరీష్ వారు రుజువులతో సహా అసెంబ్లీ వేదికగా నిరూపించడం తో కాంగ్రెస్ పాలకులు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు కోతలు పెరిగాయని, రైతులకు నీరు అందడం లేదని, రైతు బంధు రాలేదని ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇంకా ఆరు గ్యారెంటీ హామీల అమలు విషయంలో కూడా ప్రజలకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇవేవీ పైకి బొక్కకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు తెర తీశారు కాంగ్రెస్ పాలకులు. అయితే ప్రతిపక్ష బి‌ఆర్‌ఎస్ నేతలు వాటన్నిటిని అసెంబ్లీలో ప్రస్తావించడంతో కాంగ్రెస్ పాలకుల వద్ద సమాధానం కరువైంది. మొత్తానికి ఈ అసెంబ్లీ సమావేశాల్లో బి‌ఆర్‌ఎస్ ను ఇరికించబోయి కాంగ్రెస్ పాలకులే సెల్ఫ్ గోల్ వేసుకున్నారనేది స్పష్టమైంది.

Also Read:Vishal:ఎనిమిది కోట్లు వద్దన్న విశాల్

- Advertisement -