వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరానున్నట్లు గత కొన్నాళ్లుగా వార్తాలు చక్కర్లు కొడుతున్నాయి. టి కాంగ్రెస్ నేతలు కూడా ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావనకు తెస్తూ కన్ఫర్మ్ చేస్తుండడంతో వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో గ్యారెంటీ అనే వాదన నడుస్తోంది. ఇప్పటికే బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వంటి సీనియర్ నేతలంతా షర్మిల ఆహ్వానం పలుకుతున్నాట్లు పలుమార్లు చెప్పుకొచ్చారు. ఇక తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత కెవిపి రామచంద్రరావు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఖమ్మం సభ తరువాత రాహుల్ గాంధీని కలిశానని, షర్మిల కాంగ్రెస్ లోకి వస్తున్నట్లు స్పష్టమైన సమాచారం ఉందని రాహుల్ గాంధీ చెప్పినట్లు రామచంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు..
అటు షర్మిల కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ విషయాలపై స్పందించకపోవడంతో ఆమె నిజంగానే కాంగ్రెస్ వైపు చూస్తోందనే వాదనకు బలం చేకూరుతోంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం బిఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మద్య టాఫ్ ఫైట్ నెలకొనే అవకాశం ఉంది. ఇలాంటి రసవత్తరమైన పోరులో తాను గెలిచి నిలవడం కష్టమేనని షర్మిల భావిస్తోందట. అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆమె కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె రాకను కాంగ్రెస్ కూడా స్వాగతిస్తున్నప్పటికి అధిష్టానం మాత్రం కండిషన్స్ అప్లై అంటోందట.
Also Read:అధ్యక్ష పదవికి నేను అర్హుడినే:రఘునందన్
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. అందువల్ల బలహీనంగా ఉన్న ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ తరుపున ఆమె ప్రాతినిథ్యం వహిచాలని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతోందట. ఇక్కడే షర్మిల కొంత వెనకడుగు వేస్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు నడుస్తున్నాయి. ఆంధ్రలో తన అన్న వైఎస్ జగన్ ను వ్యతిరేకంగా కాంగ్రెస్ తరుపున పోరాడితే.. కుటుంబ పరంగాను, రాజకీయ పరంగాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని షర్మిల ఆలోచిస్తుందట. దీంతో కాంగ్రెస్ వైపు అడుగులు వేయాలా వద్దా అనే దానిపై షర్మిల ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో షర్మిల దారి ఎటువైపు ఉంటుందో చూడాలి.
Also Read:నేను డౌటే.. బండి హింట్ ఇచ్చాడా?