తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్ లో ఆందోళన కూడా పెరుగుతోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక తీవ్ర తలనొప్పిగా మారగా ఇప్పుడు సిఎం అభ్యర్థి ఎవరనేది ఇంకో పెద్ద సమస్యగా మారింది. పార్టీలో సీనియర్ నేతలంతా సిఎం అభ్యర్థుల జాబితాలొకే వస్తారు. పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇలా ప్రతి సీనియర్ నేత సిఎం అభ్యర్థి రేస్ లో ఉన్నవారే. ఇప్పుడు కొత్తగా వైఎస్ షర్మిల కూడా సిఎం అభ్యర్థి రేస్ లో ఉన్నారట. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం కూడా షర్మిల రాకను స్వాగతిస్తున్నట్లు సమాచారం. .
అయితే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలంటే పలు కండిషన్స్ పార్టీ హైకమాండ్ ముందు ఉంచిందట. తను కోరిన కొన్ని సీట్లు తన పార్టీ అభ్యర్థులకు కేటాయించాలని, అలాగే తనను సిఎం అభ్యర్థిగా ప్రకటించాలని షర్మిల డిమాండ్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి. దీంతో అసలే పార్టీలో సిఎం అభ్యర్థిగా ఉండేందుకు సీనియర్స్ అంతా మూకుమ్మడిగా గళం ఎత్తుతున్నారు. ఇప్పుడు షర్మిల కూడా అదే పాట పడడంతో అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా మారిందట. ఎన్నికలు ఇంకా ఎంతో సమయం లేకపోవడంతో త్వరలో సిఎం అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. కానీ ఇప్పుడు నువ్వా నేనా అన్నట్లుగా ప్రతిఒక్కరు సిఎం అభ్యర్థి రేస్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరిని సిఎం అభ్యర్థిగా ప్రకటించిన పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగి అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి హస్తం పార్టీ అస్థిరమైన పార్టీ అనేది తాజా పరిణామాలతో మరోసారి రుజువౌతోంది.
Also Read:Niranjan Reddy:ఉద్యమంలో ఎన్నారైల పాత్ర అమోఘం