సీఎల్పీ నేతగా రేవంత్..7న ప్రమాణస్వీకారం

49
- Advertisement -

సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. రేవంత్ రెడ్డి ను కాంగ్రెస్ అగ్రనాయకత్వం సీఎం గా ప్రకటించింది. పార్టీ నిర్ణయాన్ని మీడియా వేదికగా ప్రకటించారు కేసీ వేణుగోపాల్. ఢిల్లీ లాబియింగ్ కు కాలం చెల్లింది కేవలం తెలంగాణ ప్రజల అభిమతాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం.

ఫలితాలు వెలువడ్డ 48 గంటల్లో కాంగ్రెస్ పార్టీ CLP నాయకుణ్ణి ప్రకటించడం విశేషం. అత్యంత స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ అన్నారు వేణు గోపాల్. మిగిలిన ఏ ఒక్క పార్టీలో వ్యక్తి చెప్పిందే వేదం కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సైనికులు చెప్పిందే వేదం అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నిర్ణయం… కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోగతం అన్నారు. ఈ నెల 7న రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Also Read:హ్యాపీ బర్త్ డే…నేహా శెట్టి

- Advertisement -