ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చెప్పిందే జరుగుతోంది.. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అందరూ వెళ్లి అమరావతిచుట్టూ తిరగాల్సి వస్తుంది అని.. జనం ఈ దెబ్బకు కాంగ్రెస్ కు మొండి చెయ్యి చూపినా నేతలు ఇంకా మారలేదు.. పదవుల కోసం అమరావతి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం కాంగ్రెస్ నేతలు అమరావతికి క్యూ కడుతున్నారట.. ఎమ్మెల్సీ రేసులో ప్రధమంగా ఉన్న మర్రి శశిధర్ రెడ్డి రెండు రోజుల క్రితం అమరావతికి వెళ్లి చంద్రబాబును కలిశారు.. తనకు తెలంగాణలోని ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు ఇప్పించండి అని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
(చంద్రబాబు నీరోచక్రవర్తి..పచ్చబాబు ఇజ్జత్ తీసిన కేటీఆర్) https://goo.gl/X1GWPT
తొమ్మిది మందితో కూడిన కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక ప్రక్రియ చేపట్టింది.. కమిటీ ముందుకు ప్రధానంగా మర్రి శశిధర్ రెడ్డి, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి పేర్లు వచ్చాయి..మొన్నటి ఎన్నికల్లో సనత్ సీటును మిత్ర పక్షం టీడీపీకి వదిలివేయడంతో మర్రి శశిధర్ రెడ్డికి పోటీ చేసే అవకాశం లభించలేదు.. మరోవైపు గూడురు నారాయణ రెడ్డి భువనగిరి నుంచి పార్లమెంటు ఎన్నికల్లోపోటీ చేయాలని భావిస్తున్నారు.. వీరెవరికీ కాకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం పోటీలో ఉన్నట్లు సమాచారం..సో..మొత్తం మీద కాంగ్రెస్ నేతలు అనుకున్నట్లుగానే అమరావతి బాట పడుతున్నారన్న మాట..