బత్తాయి తిందాం.. బతుకును రక్షించుకుందాం..

288
Telangana CM PRO distributing Bathai fruits
- Advertisement -

బత్తాయిని శరీరానికి అందించడం ద్వారా సి విటమిన్ పుష్కలంగా అందుతుందని దాంతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు ఎంపీ జోగిన పల్లి సంతోష్ కుమార్. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు, బత్తాయి దినోత్సవాన్ని పురస్కరించుకుని, తూర్పుగూడెం స్వగ్రామంలో సోమవారం ఇంటింటికీ బత్తాయి పంపిణీ కార్యక్రమాన్ని,సీఎం పిఆర్వో రమేశ్ హజారి చేపట్టారు.

Telangana CM PRO distributing Bathai fruits

ఈ సందర్భంగా హజారి మాట్లాడుతూ.. మన శరీరానికి సీ విటమిన్ అందించడం ద్వారా కరోనాను దరిచేర నీయకుండా, రోగనిరోధక శక్తిని పెంచుకొగలమని ఆయన అన్నారు. ముఖ్య మంత్రి కెసిఆర్ ఆకాంక్షల మేరకు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన బత్తాయి దినోత్సవ పిలుపు మేరకు తానీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుజ్జ పూలమ్మ, నామినేటెడ్ సభ్యులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ హజరి జగ్గయ్య,గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు గుండ్ల వెంకన్న,సోమ వెంకన్న,రామ్మూర్తి,వార్డ్ మెంబర్లు తదితులు పాల్గొన్నారు.

- Advertisement -