దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

484
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్‌ దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞానాంధకారాన్ని పారదోలి జ్ఞానపు కాంతులు ప్రసరింపజేయాలనే తత్వాన్ని దీపావళి నేర్పుతుందని ఆయన వెల్లడించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి జరుపుకుంటామని ఆయన అన్నారు. దేశ, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, సిరిసంపదలతో తులతూగాలని మనసారా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ మాదిరిగానే దేశ ప్రజలందరి జీవితాల్లో ఆనందపు ప్రగతి కాంతులు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

- Advertisement -