పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. జనగామ జిల్లా పాలకుర్తిలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గోన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుర్తిని దయాకర్ రావు చాలా అభివృద్ది చేశాడని చెప్పారు. దయాకర్ రావు గురించి నాకన్న ఎక్కువ మీకే తెలుసన్నారు. రైతుబంధు పథకం దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు.
దేవాదుల ప్రాజెక్టుల ద్వారా వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేసినమని చెప్పారు. దేవాదుల నీళ్ల ద్వారా లక్ష ఎకరాలకు నిరందింస్తామని హామి ఇచ్చారు. దేశంలో ధనికులైన రైతులు ఎక్కడ ఉన్నారంటే అది తెలంగాణలోనే అని చెప్పుకునే స్ధాయిలోకి రావాలి. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించిందన్నారు.
అంగన్ వాడి టీచర్లకు, ఆశావర్కర్లకు దేశంలో అతి ఎక్కువ జీతం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. అలాగే హోంగార్డులకు కూడా ఎక్కువ జీతాలు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ప్రస్తుతం వెయ్యి రూపాయలు ఇస్తున్న ఆసరా పెంఛన్లను రూ.2016 చేస్తామని హామి ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా వందశాతం సబ్సిడితో ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు.