పరుల కోసమే పరితపించిన ప్రజాకవి కాళోజీ: సీఎం కేసీఆర్‌

65
cm kcr
- Advertisement -

పద్మవిభూషణ్‌, ప్రజాకవి కాళోజీ నారాయణరావు నిత్యం పరుల క్షేమం కోస‌మే పరితపించారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ యాస, భాష, భావుకతకు కాళోజీ సాహిత్యం ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 9న‌ కాళోజీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆయనను స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, కవిగా కాళోజీ చేసిన సేవలు గొప్పవని పేర్కొన్నారు. తెలంగాణ భాష, సాహిత్యానికి కాళోజీ చేసిన కృషిని గౌరవిస్తూ..కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

తెలంగాణ భాషా, సాహిత్య రంగాల్లో విశేష కృషిచేస్తున్న తెలంగాణ సాహితీవేత్తలు, కవులు, వైతాళికులను గుర్తించి.. కాళోజీ నారాయణరావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట పురసారాన్ని అందిస్తున్నదని పేర్కొన్నారు. ఈ ఏడాదికిగానూ కాళోజీ పురస్కారానికి ఎంపికైన‌ కవి, చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్‌కు సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా శుభాభినందనలు తెలిపారు.

- Advertisement -