కేంద్రమంత్రి గడ్కరీతో సీఎం కేసీఆర్ భేటీ…

110
kcr

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. రీజిన‌ల్ రింగ్ రోడ్డును ఆమోదించినందుకు గ‌డ్క‌రీకి సీఎం కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌నున్నారు. వ‌ర‌ద‌ల వ‌ల్ల దెబ్బ‌తిన్న రోడ్ల‌కు నిధులు కోరే అవ‌కాశం ఉంది. నూత‌న జాతీయ ర‌హ‌దారుల నిర్మాణంపై విజ్ఞ‌ప్తి చేసే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే మంజూరైన హైవేల‌కు త్వ‌ర‌గా నెంబ‌ర్లు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేయ‌నున్నారు. హైవేల నిర్మాణ ప‌నుల్లో వేగం పెంచాల‌ని, నిర్వ‌హ‌ణ‌కు నిధులు కేటాయించాల‌ని గ‌డ్క‌రీని సీఎం కేసీఆర్ కోరే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టికే ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను క‌లిసి రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌ను కేసీఆర్ వారి దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యమంత్రితో పాటు భేటీకి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బిబి పాటిల్, రాములు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి హాజరయ్యారు.