- Advertisement -
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. కోల్ కత్తా సచివాలయంలో మమతా బెనర్జీతో సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై చర్చిస్తున్నారు. ముందుగా సచివాలయానికి చేరకున్న కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు మమతా బెనర్జీ. ఈసమావేశం ముగిసిన తర్వాత కోల్ కత్తాలోని కాళీమాత అమ్మవారిని సందర్శించనున్నారు కేసీఆర్. సాయంత్రం తిరిగి ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఈ నెల 26 లేదా 27న ప్రధాని మోదీని కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలవనున్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ తోనూ కేసీఆర్ సమావేశం కానున్నారు.
- Advertisement -