ఒడిశా సీఎంతో సమావేశమైన సీఎం కేసీఆర్‌..

240
CM KCR
- Advertisement -

కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో అడుగులు వేగంగా పడుతున్నాయి. జాతీయ స్థాయి పర్యటనలో భాగంగా ఒడిశా వెళ్లిన సీఎం కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సమావేశమయ్యారు. ఈసందర్భంగా వాళ్లిరువురు ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించారు. అంతకుముందు తన నివాసానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు.. నవీన్ పట్నాయక్ సాదరంగా ఆహ్వానం పలికారు. కేసీఆర్‌ ఈ రోజు రాత్రి ఇక్కడే బస చేస్తారు.

CM KCR

24వ తేది ఉదయం కోణార్క్ సూర్య దేవాలయం, పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శిస్తారు. పూజల అనంతరం భువనేశ్వర్ చేరుకుని మధ్యాహ్నం అక్కడే భోజనం చేస్తారు. తర్వాత అక్కడి నుంచి కోల్‌కతా వెళ్తారు. 24న సాయంత్రం 4 గంటలకు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో సమావేశమవుతారు.

- Advertisement -