తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం. రాష్ట్రవ్యాప్తంగా కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ పథకానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఈ పథకం విజయవంతం కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ఆనందంగా ఉన్నారు. ఈసందర్భంగా రైతు సమన్వయ సమితి సభ్యులతో హెచ్ ఐసిసిలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ఎర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
రైతులకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాన్ని తిసుకువచ్చిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న రైతులందరికీ ఈ రైతుబీమా పథకం వర్తిస్తుందన్నారు. రైతు మరణించిన 10 రోజుల్లోనే రూ. 5లక్షలు అందించేలా ఉచిత జీవిత బీమా పథకానికి రూప కల్పన చేశారు. ఈపథకం కోసం నేడు ప్రభుత్వ రంగ ఎల్ ఐసీ, తెలంగాణ ప్రభత్వం మధ్య అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంతటి మంచి కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకులు విమర్శించడం సరికాదన్నారు. రైతుబంధు పథకంతో గ్రామాల్లో రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.
తెలంగాణలో రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతాలు చేస్తున్నాయన్నారు. రైతు సమన్వయ కర్తలు రైతులపై దగ్గరగా ఉండి వారికి సహాయపడాలన్నారు. రైతులు పెట్టుబడి అప్పులు చేయకుండా రైతు బంధు పథకం ఉపయోపడుతున్నాయన్నారు. ఆగస్టు 15 తర్వాత నుండి రైతు భీమా పథకం ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన రైతులకు రూ.5 లక్షల బీమా వర్తిస్తుందన్నారు. ప్రతి గ్రామంలో రైతులు కలిసి మాట్లాడుకునేలా భవనాలు నిర్మిస్తామన్నారు.
రైతులు మూస పద్దతిలో అందరూ ఒకే పంట వేయకుండా ఆలోచించి పంటలు వేయాలన్నారు. రైతు కొడుకు రైతు అని గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందన్నారు. ఆవిధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎరువుల విషయంలో కూడా మండల సమన్వయ సమితి అధికారులు దగ్గరుండి చూసుకోవాలన్నారు. దేశంలో గొప్ప రైతులు ఎక్కడున్నారు అంటే తెలంగాణలో అనే విధంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏవిధంగా అయితే కష్టపడి సాధించుకున్నామో..వ్యవసాయంపై కూడా అదే విధంగా కష్టపడి రైతును బాగుపడేలా చేయాలన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు బాగుంటే అందరం బాగుంటామని చెప్పారు.