- Advertisement -
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఢిల్లీలోని 7 లోక్ కల్యాణ్ మార్గ్ లోని మోదీ నివాసంలో ఆయనను సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కేసీఆర్ తెలంగాణలో రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానిని కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, విభజన హామీలపై కేసీఆర్ చర్చిస్తున్నారు.
ముఖ్యంగా హైకోర్టు విభజనకు వీలైనంత త్వరగా గెజిట్ విడుదలయ్యేలా చూడాలని కేసీఆర్ కోరనున్నారు. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన, ఏపీ రాజధాని అమరావతికి తరలివెళ్లినందున హైదరాబాద్‌లో వారికి కేటాయించిన సచివాలయంలోని భవనాలతోపాటు, ఆయా హెచ్‌వోడీల కార్యాలయ భవనాలను తిరిగి అప్పగించాలని విజ్ఞప్తి చేయనున్నారు
- Advertisement -