తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈమేరకు సీఎం కేసీఆర్ దశాబ్ది ఉత్సవాల లోగోను ఆవిష్కరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ ఈ లోగోను ఆవిష్కరించారు. ఇందులో తెలంగాణతో మమేకమైన అనేక విషయాలను పొందుపరిచారు.
తెలంగాణ తల్లి బతుకమ్మ బోనాలు పాల పిట్ట అమరవీరుల స్మారకంతో కూడిన తెలంగాణ అస్తిత్వ చిహ్నాలతో కూడిన తెలంగాణ ఖ్యాతిని మరింత ఇనుమడింపచేలా ఈలోగోను ఆవిష్కరించారు. ఇంకా తెలంగాణ ప్రాధాన్య పథకాలు ప్రతిబింబించేలా లోగో డిజైన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ భగీరథ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి ఆలయంను కూడా లోగోలో పొందుపరిచారు. హైదరాబాద్ మెట్రో రైల్‌కు దశాబ్ది లోగోలో చోటు కల్పించారు. తెలంగాణకు సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలను కూడా లోగోలో చేర్చారు.
Also Read: ఆ నలుగురిపై బీజేపీ నజర్ ?
ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, పాడి కౌశిక రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్కసుమన్, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Also Read: ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీగా బిఆర్‌ఎస్ !