దేశ వైద్యవిద్యా రంగంలో ఒక చారిత్రక సందర్భం ఏర్పాటు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. మంగళవారం ప్రగతి భవన్ వేదికగా రాష్ట్రంలో 8నూతన వైద్యా కాలేజీలను వీడియో కాన్ఫరేన్స్ ద్వారా ఏర్పాటు చేశారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థు తరగతులను ఆన్లైన్ ద్వారా ప్రారంబించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వైద్య విద్యార్థులను సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు కృషి చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఇతర ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఒకనాడు తెలంగాణ అనేక సమస్యలతో సతమతమైన తెలంగాణ ఇప్పుడు బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ అడుగులు పడ్డాయన్నారు. త్రాగునీరు సాగునీరు కరెంటు మెడికల్ సీటు ఇంజినీరింగ్ సీటుకు నాడు ఎన్నో అవస్థలు పడ్డా తెలంగాణ…నేడు సర్వతోముఖాభివృద్ది సాధించిందన్నారు.
తెలంగాణలో నేడు 8మెడికల్ కాలేజీలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో మహబూబ్‌నగర్ సిద్దిపేట నల్లగొండ సూర్యపేటలో కాలేజీలు ప్రారంభించుకున్నాము. వాటిని విజయవంతంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ రోజు సంగారెడ్డి మహబూబాబాద్ మంచిర్యాల జగిత్యాల వనపర్తి కొత్తగూడెం నాగర్‌కర్నూలు రామగుండంలో మనం కొత్తగా కాలేజీలు ప్రారంభించి క్లాసులు ప్రారంభించుకున్నామని అన్నారు.
గిరిజన ప్రాంతం అయిన మహబూబాబాద్ వనపర్తి వంటి మారుమూల ప్రాంతంలో ప్రభుత్వ కళాశాలలు ప్రారంభించడం అంటే తెలంగాణాంతటా అభివృద్ది ఫలాలు అందుతున్నాయని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు వైద్యారోగ్య శాఖామాత్యులు హరీశ్‌రావు కృషితో కొత్తగా 8కళాశాలలు ఏర్పాటు అయ్యాయని అన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల రావాలని మనం సంకల్పించుకున్నామని అన్నారు. ఇప్పటికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17కు పెరిగాయని మరో 7 జిల్లాల్లో నూతన మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉందన్నారు
గతంలో 850 ఎంబిబిఎస్ సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉండేవి. ఈ రోజు ఆ సంఖ్య 2,790 కి పెరిగింది. ఈ సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగి మన పిల్లలందరికీ సీట్లు లభించడం నాకు చాలా సంతోషం కలిగిస్తున్నది. అదే విధంగా పీజీ సీట్లు, సూపర్ స్పెషాలిటీ సీట్లు మనం గణనీయంగా పెంచుకున్నాం. గతంలో 531 పీజీ సీట్లు ఉంటే, ప్రస్తుతం 1,180 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
గతంలో సూపర్ స్పెషాలిటీ సీట్లు 70 మాత్రమే ఉంటే, ఈ రోజు 152 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో విద్యార్థులకు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. జనాభా నిష్పత్తికి అనుగుణంగా డాక్టర్లు అందుబాటులో ఉండడం ఎంత అవసరమో, పారా మెడికల్ సిబ్బంది సిబ్బంది ఉండడం అంతే అవసరం. అదే వైద్య రంగ పటిష్టతను సూచిస్తుంది. ఈ సంఖ్యను పెంపొందించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ దిశగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది
కరోనా వంటి పాండమిక్ భయోత్పాతాన్ని మనం చూశాం. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వైద్యరంగాన్ని పటిష్టం చేస్తున్నాం. ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా గొప్ప రక్షణ కవచంగా ఉండాలని వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని వేల కోట్ల రూపాయలు వెచ్చించి మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నది. అన్ని రంగాల్లో తెలంగాణ ఆచరిస్తుంది… దేశం అనుసరిస్తుంది. వైద్యరంగంలో కూడా తెలంగాణను దేశం అనుకరించే విధంగా యువ రాష్ట్రమైన తెలంగాణ ఎదగడం నాకు చాలా సంతోషంగా ఉంది.
పేదల ప్రజల సంక్షేమమే ద్యేయంగా వైద్యరంగానికి చెందిన విద్యార్థులు, అధ్యాపకులు ముందుకు సాగాలి. పేదల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ బాధ్యత కాబట్టీ ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం వెనుకాడదు. రాష్ట్ర వ్యాప్తంగా పారామెడికల్ కాలేజీలు త్వరలోనే ప్రారంభించుకునేలా వైద్యారోగ్య శాఖామాత్యులు హరీష్ రావు చర్యలు చేపడతారని సీఎం తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, శాసనసభ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ ఎస్.మధుసూదనాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తాతా మధూధన్ రావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్ రెడ్డి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్, హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, వైద్యశాఖ అధికారులు గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..