ఢిల్లీకి సీఎం కేసీఆర్..

252
KCR
- Advertisement -

సీఎం కేసీఆర్ నేడు హస్తీన వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి చెందిన పలు సమస్యలతో పాటు విభజన హామీలను నెరవేర్చాల్సిందిగా కోరనున్నారు. దీంతో పాటు ప్రభుత్వం జోనల్ వ్యవస్థకు పలు ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సిఫారసు చేయాలని ప్రధానిని కోరనున్నారు.

మైనార్టీలు, గిరిజనుల రిజర్వేషన్లను పెంచాలని సీఎంను కోరనున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీచేసిన తీర్మానాన్ని కేంద్రానికి రాష్ట్రం పంపించిన విషయాన్ని గుర్తుచేయనున్నారు. రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి పంట పెట్టుబడి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూ.8 వేలు ఇస్తున్న విషయాన్ని తెలుపనున్నారు. దీంతో పాటు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం,పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరనున్నారు.

9,10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన సమస్యలపై కూడా ప్రధానితో చర్చిస్తారు. హైకోర్టు విభజన, ఎయిమ్స్‌కు నిధులు, పన్నులలో వాటాపెంపు, ప్రాజెక్టులకు సహకారం, పెండింగ్‌బిల్లుల విడుదలతోపాటు రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 17వ తేదీన ఢిల్లీలో నీతిఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొననున్నట్లు సమాచారం.

- Advertisement -