ఆంధ్రలో సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీ.. పవన్‌ ఫ్యాన్స్‌ ప్రశంసలు..

185
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఫ్లెక్సీ వెలిసింది. కేసీఆర్‌ ఫ్లెక్సీ ఆంధ్రలో పెట్టడం ఏంటనుకుంటున్నారా..! అయితే అసలు విషయంలోని వెల్లాల్సిందే.. నిన్న భీమ్లా నాయ‌క్ సినిమా విడుద‌ల నేప‌థ్యంలో టికెట్ల ధ‌ర‌లు, ఇత‌ర అంశాల‌పై తెలంగాణ ప్ర‌భుత్వ ప‌నితీరును మెచ్చుకుంటూ.. ప‌వ‌న్ అభిమానులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. భీమ్లా నాయ‌క్ సినిమాకు తెలంగాణ‌లో బెనిఫిట్ షోకు అనుమ‌తి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప‌వ‌ర్ స్టార్ అభిమానులు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.. హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్ అంటూ ఆయ‌న ఫోటోతో కూడిన ఫ్లెక్సీని విజ‌య‌వాడ‌లో ప్ర‌ద‌ర్శించారు. ఆ ఫ్లెక్సీలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రులు కేటీఆర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, జ‌న‌సేన నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్, వంగ‌వీటి రంగా, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధాకృష్ణ ఫోటోల‌ను కూడా ప్ర‌ద‌ర్శించారు. ఇక శుక్రవారం గ్రాండ్‌గా విడుదలైన ‘భీమ్లా నాయక్’ భారీ వసూళ్లను రాబడుతోంది.

- Advertisement -