ఎఫ్ఆర్వో కుటుంబానికి అండగా ఉంటాం :సీఎం

174
- Advertisement -

గుత్తికొయల దాడిలో మృతి చెందిన శ్రీనివాసరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బెండాలపాడు గ్రామంలో జరిగిన దాడిలో శ్రీనివాసరావు గాయపడిన సంగతి తెలిసిందే. శ్రీనివాసరావుకు మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈసందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు.

ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుటుంబాన్నికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. దాడిలో మరణించిన శ్రీనివాసరావు డ్యూటీలో వుంటే ఏ విధంగానైతే నిబంధనల ప్రకారం జీతభత్యాలు అందుతాయో అవే నిబంధనల ప్రకారం ఆయన కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలని ఆదేశించారు. ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు వ‌ర‌కు వారి కుటుంబ సభ్యులకు ఈ వేతనం అందచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సూచించారు.

అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. శ్రీనివాస రావు అంత్యక్రియల్లో పాల్గొని సంబంధిత ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు.

విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఏమాత్రం సహించబోమని సీఎం స్పష్టం చేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. ఎలాంటి జంకు లేకుండా తమ విధిని నిర్వర్తించాలని,ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి…

మొక్కలు నాటిన…చీఫ్ విప్ దాస్యం

ఏడబ్ల్యూఎస్ సెంటర్‌కు స్వాగతం…కేటీఆర్ ట్వీట్‌

భారత్ జోడో యాత్రలో ప్రియాంక…

- Advertisement -