ఏడబ్ల్యూఎస్ సెంటర్‌కు స్వాగతం…కేటీఆర్ ట్వీట్‌

270
- Advertisement -

తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుందని…ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం వల్లే సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ ట్వీటర్‌ ద్వారా తెలిపారు. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈసందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేస్తూ ఏడబ్ల్యూఎస్ సెంటర్‌ ద్వారా రానున్న కాలంలో తెలంగాణలో మరిన్ని ఉద్యగోవకాశాలు పెరుగుతాయని అన్నారు.

దేశంలోనే రెండో అతిపెద్ద అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ రీజియ‌న్ సెంట‌ర్‌ను ప్రారంభించిన‌ట్లు అమెజాన్ ఆసియా ఫ‌సిఫిక్ రీజియ‌న్‌ ప్ర‌క‌టించింది. హైదరాబాద్ సెంటర్ ద్వారా 2030 నాటికి సుమారు రూ. 36,300 కోట్ల పెట్టుబ‌డుటు పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ పెట్టుబ‌డుల‌తో సంవ‌త్స‌రానికి స‌గ‌టును 48 వేల ఉద్యోగాల క‌ల్ప‌న జ‌రిగే అవ‌కాశం ఉంది.

ఏడబ్ల్యూఎస్ సెంటర్‌ ఏర్పాటుతో దేశంలోనే ప్ర‌గ‌తిశీల డేటా సెంట‌ర్ హ‌బ్‌గా తెలంగాణ స్థానాన్ని బ‌లోపేతం చేస్తుంద‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైద‌రాబాద్‌లో ప్రారంభించిన అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ భ‌విష్య‌త్‌లో రూ. 36,300 కోట్ల పెట్టుబ‌డులు పెడుతామ‌ని చెప్పిన ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తిస్తున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి…

పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్:బాస్ సాంగ్

భారత్ జోడో యాత్రలో ప్రియాంక…

గుజరాత్‌ను బీజేపీ లూటీ చేసింది:గధ్వీ

 

- Advertisement -