జమున మృతి తీరని లోటు:కేసీఆర్‌

22
- Advertisement -

గతేడాది వరుసగా టాలీవుడ్ ఆగ్రనటులు మరణించిన సంగతి తెలిసిందే. ఆ చేదు ఘటనలు మరువకముందే మరో ఆగ్రతార నింగికేగింది. అలనాటి నటి జమున మృతి చేందారు. 1953లో తెలుగు చలన చిత్ర రంగంలో అడుగుపెట్టిన జమున…మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా నాటి జమున జ్ఞాపకాలను సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. ఆమె మరణం సినీ లోకానికి తీరని లోటన్నారు. వందల చిత్రాల్లో నటించి మెప్పించి తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిలో నిలిచారని అన్నారు.

తెలుగుతో పాటు కన్నడ తమిళ్ హిందీ భాషల్లో ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలో నటించి మెప్పించి అశేషమైన ప్రేక్షకాభిమానాన్ని పొందారని కొనియాడారు. సినీనటిగా కళాసేవకే పరిమితం కాకుండా ఎంపీగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన జమున ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. జమున గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

హైదరాబాద్‌లోని స్వగృహంలో ఈ రోజు ఉదయం 11గంటలకు మరణించినట్టు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. కాసేపట్లో కాసేపట్లో ఆమె భౌతికకాయాన్ని ఫిల్మ్‌ చాంబర్‌కు తరలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం అక్కడ ఉంచనున్నారు. అనంతరం జూబ్లిహిల్స్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి…

సీనియర్ నటి జమున ఇకలేరు..

జమున లైఫ్ లోని ఇంట్రెస్టింగ్ విషయాలు

విస్తరిస్తోన్న బి‌ఆర్‌ఎస్.. ఆ పార్టీలకు ముప్పే!

- Advertisement -