తెలంగాణకు నిరంతర విద్యుత్ వెలుగులు పంచేందుకు యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్‌ప్లాంట్ పనులను సీఎం కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. సీఎస్ సోమేష్‌కుమార్ విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఎరియల్ వ్యూ ద్వారా పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను పురోభివృద్ది గురించి ఆరా తీశారు. ఫస్ట్ స్టేజ్ యూనిట్ 2లో బాయిలర్ నిర్మాణంలో 82మీటర్ల ఎత్తులోని 12వ ఫ్లోర్‌లో జరుగుతున్న పనులను సీఎం పరిశీలించి అధికారులకు సూచనలు జారీ చేశారు. మరికాసేపట్లతో ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.
2023, డిసెంబర్ చివరి నాటికి యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి, విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రానికి వెలుగులు పంచాలని జెన్‌కోకు సూచించారు. పనులను వేగవంతం చేయాలన్నారు. 2015లో ఈ పవర్ ప్లాంట్ పనులు ప్రారంభం కాగా, ఇప్పటికే ప్లాంటులో రెండు యూనిట్ల పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగతా మూడు యూనిట్లు 70 శాతం వరకు అయ్యాయి. 5 వేల ఎకరాల్లో రూ.29,965 కోట్లతో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంతో 5 పవర్ ప్లాంట్లను నిర్మిస్తున్నారు.
Live: CM Sri KCR inspecting the progress of Yadadri Thermal Power Plant works at Damaracharla. https://t.co/CeGmkqB9kt
— Telangana CMO (@TelanganaCMO) November 28, 2022
ఇవి కూడా చదవండి…
దామరచర్లకు సీఎం కేసీఆర్..
కొత్త సచివాలయం..ముహూర్తం ఖరారు
కేంద్రం కీలక నిర్ణయం….