రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుండటంతో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సినిమా థియేటర్ల టైమింగ్స్ ఛేంజయ్యాయి.
సినిమా థియేటర్ల యజమానులు సెకండ్ షోను రద్దు చేయగా మిగతా మూడు షోల సమయాన్ని సవరించారు. మార్నింగ్ షో ఉదయం 11 గంటలకు మొదలై మధ్యాహ్నం 1.30గంటల వరకు.. మ్యాట్నీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు.. ఫస్ట్ షోను 5 గంటలకు మొదలై రాత్రి 8 గంటలలోపు ముగించేలా మార్చారు.
సినిమా థియేటర్ల సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ప్రవేశద్వారాల వద్ద తప్పనిసరిగా శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. సామాజిక దూరం పాటించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని పేర్కొంది ప్రభుత్వం. థియేటర్లలో 24 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత, 40–70 శాతం తేమ, లోపలికి, బయటికి గాలి ప్రసరించేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది.