- Advertisement -
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్ లో జరుగుతున్న ఈసమావేశానికి రాష్ట్ర మంత్రులతో పాటు సీఎస్ సోమేష్ కుమార్ పలువురు అధికారులు హాజరయ్యారు. ఈమంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు.
మార్చి మొదటివారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయే అవకాశమున్న నేపథ్యంలో బడ్జెట్ రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. కేంద్రప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులతోపాటు పట్టణ ప్రగతి, పల్లెప్రగతి, ఇతర కీలక అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -