పోలీసు శాఖలో 26290 ఉద్యోగాలు..

219
Telangana cabinet meeting
Telangana cabinet meeting
- Advertisement -

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ వివరాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మీడియాకు వెల్లడించారు. ఈ కాబినెట్ సమావేశంలో నాలుగు ఆర్డినెన్స్‌లను అమోదించడం జరిగిందన్నారు. జాగీర్, సంస్థాన్, మక్తా, బైగా, ఇనామ్ భూములకు సంబంధించి ఆర్‌వోఆర్ చట్టంలో రిజిస్టేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం సవరణ చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ఆన్‌లైన్ గేమింగ్, ఆన్‌లైన్ పేకాట తెలంగాణలో నిషేధం, తెలంగాణ వ్యాట్‌యాక్ట్ సవరణ, నాలుగు ఆర్డినెన్స్‌లను జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రైతు సమగ్ర సర్వేలో పేర్లు నమోదు చేసుకోని రైతులు తమ పేర్లు, భూముల వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

గజ్వేల్‌లో జూన్‌ 20న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోకవర్గాల్లో పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు కడియం. జూలై మొదటివారంలో హరిత హరం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. హరితహారంలో 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు కడియం. జూలై నెలలో 100 సంచార పశు వైద్య శాలలు ప్రారంభిస్తామన్నారు. పోలీసు శాఖలో 26290 ఉద్యోగాలను మూడేళ్లలో దశలవారీగా భర్తీ చేస్తామన్నారు.

ఆక్టోబర్ 22 నుండి వారం రోజుల పాటు తెలంగాణ ప్రపంచ మహా సభలు నిర్వహించాలని కేబినేట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. జోనల్ వ్యవస్థలో మూడు రకాల నియామకాలు జరుగుతున్నాయన్నారు. జోనల్ వ్యవస్థలో మార్పులపై సీఎస్ చర్చలు జరిపారని.. త్రీటైర్ సిస్టమ్ నుంచి 2 టైర్‌కు మారితే బాగుంటుందని నిర్ణయించామన్నారు. ఇకపై రాష్ట్ర, జిల్లా కేడర్లు రెండే ఉండాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రానికి పంపుతామని చెప్పారు. దీని అధ్యయనానికి సీఎస్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రోడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ రుణ పరిమితి రూ.5 వేల కోట్లకు పెంచుతు నిర్ణయం తీసుకున్నాం. ఇందులో రూ.1200 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుందని తెలిపారు.

- Advertisement -