- Advertisement -
తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం నేడు జరగనుంది. అసెంబ్లీ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యం, రేపు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనుండటంతో ఇవాళ జరిగే కేబినెట్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రగతి భవన్‌లో ఇవాళ సాయంత్రం 7 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఈ సమావేశంలో సభలో ప్రవేశపెట్టే బడ్జెట్ తో పాటుగా, ప్రవేశపెట్టబోయే బిల్లులు, వాటి ఆమోదం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అని విషయంపై చర్చించబోతున్నారు. ఏపీలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
- Advertisement -