- Advertisement -
తెలంగాణ కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు.
కరోనా నియంత్రణ, వైరస్ నిర్ధారణ పరీక్షలు, వైద్య రంగంలో తీసుకురావాల్సిన మార్పులు, కొత్త సచివాలయం నిర్మాణం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
సచివాలయ కొత్త డిజైన్లకు ఆమోదం తెలపనున్నారు. ఉద్యోగుల జీతాల్లో కోత, ఆయుష్ వైద్యుల వయోపరిమితి పెంపు కోసం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లకు మంత్రిమండలి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఉద్యోగుల పదవీ విరమణను 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతామని కేసీఆర్ గతంలో మాటిచ్చారు. దీనికి కూడా అమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -