ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ భేటీ ఇవాళ జరగనుంది. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ప్రగతిభవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలకనిర్ణయాలు తీసుకోనున్నారు.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై సుదీర్ఘ చర్చజరగనుంది. సంక్షేమం,పెన్షన్‌ల పెంపులాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడంతో అన్ని శాఖలపై ఆర్దిక బారం పెరిగింది. అందుకు తగ్గట్టుగానే బడ్జెట్ ను రూపకల్పన చేశారు. అనంతరం బడ్జెట్‌కు అమోదం తెలపనుంది కేబినెట్.
కోటి ఎకరాలకు నీరందించే లక్ష్యంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించనున్నారు. దీంతో పాటు ఇంటింటికి తాగు నీరందించే మిషన్ భగీరధకు పూర్తి స్థాయిలో నిధుల కేటాయించనున్నారు. వ్యవసాయానికి పెట్టు బడి సాయం పెంపు, రైతు బీమా వంటి పథకాలకు నిధులు కేటాయించనున్నారు.
అటవీశాఖ ను మరింత పటిష్టం చేసేలా చట్టంలో కఠిన నిర్ణయాలు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విలువైన అడవులను పరిరక్షించడంతో పాటు , అటవీ సంరక్షణకు తీసుకున్న నిర్ణయాలపై కూడా కేబినెట్ అమోదం తెలపనుంది
గత కేబినెట్ లో పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, ఈటెల రాజెందర్ ఉండగా మిగతా ఆరుగురు కొత్త మంత్రులు ఉన్నారు. దీంతో బడ్జెట్ రూపకల్పన ఎలా ఉంటుందీ, ఏ ఏ శాఖలకు ఎలాంటి కేటాయింపులు చేస్తారు వంటి అంశాలను కేసీఆర్ వారికి వివరించనున్నారు.