రూ. 17 వేల కోట్ల రైతు రుణమాఫీ విజయవంతంగా అమలుచేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం మైనార్టీలు,గిరిజనుల రిజర్వేషన్లపై చర్చించామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధింగా ముస్లిం,గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు టీఆర్ఎస్ కట్టుబడి ఉందని తెలిపారు.తమిళనాడు తరహాలో రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఒక చరిత్రైతే, రైతు రుణమాఫీ దశల వారీగా చేసుకుంటూ వస్తుండడంతో మరో చరిత్రని, అలాగే రిజర్వేషన్లపై కీలక నిర్ణయాలు తీసుకొని అన్ని సామాజిక వర్గాల్లో చిరునవ్వు తీసుకొస్తుండడం మరో చరిత్రని అన్నారు. తాము ముందుగా చెప్పిందే చేస్తున్నామని, కొత్తగా ఏమీ చేయడం లేదని అన్నారు. ముస్లిం, గిరిజన రిజర్వేషన్ ల అమలుకు సుధీర్ కమిషన్, చెల్లప్ప కమిషన్ వేశాం. కమిషన్ ల రిపోర్టులు ప్రభుత్వానికి అందాయి. చెల్లప్ప, సుధీర్ కమిషన్ రిపోర్టులకు మంత్రిమండలి ఆమోదం లభించిందన్నారు సీఎం కేసీఆర్.
ఈ నెల 16న జరిగే శాసనసభా సమావేశాల్లో రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదిస్తామని తెలిపారు. ఈ నెల 15న మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో అపోహలు అనవసరమని తెలిపారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం లేదన్నారు. మిళనాడులో 50శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తున్నారని, అదే విధంగా తెలంగాణలోనూ తీసుకురావాలని చూస్తున్నట్లు తెలిపారు. తాము మతపరమైన రిజర్వేషన్లు మాత్రం ఇవ్వడం లేదని తాము ఇస్తున్న రిజర్వేషన్లు కొత్తవి కాదని, తెలంగాణ, ఏపీల్లో బీసీ-ఈ రిజర్వేషన్లు ఇప్పటికే ఇస్తున్నామని, దాన్నే కొంత శాతం పెంచుతున్నామని, కొత్తగా సృష్టించడం లేదని అన్నారు.
తమిళనాడు, బెంగాల్,కేరళ,కర్ణాటక,మణిపూర్,ఏపీ,తెలంగాణలో ముస్లిం ప్రజల వెనుకబాటు తనాన్ని గుర్తించి రిజర్వేషన్లను కొనసాగిస్తున్నాయని తెలిపారు. కేంద్రం కూడా తమకు సహకరిస్తుందన్న ఆశాభవాన్ని సీఎం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. త్వరలోనే ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.కేంద్రం రిజర్వేషన్లకు ఒప్పుకోకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తామని సీఎం స్పష్టం చేశారు.
()ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్దరించాలని కేంద్రాన్ని కోరుతు నిర్ణయం
()స్టేట్ హెరిటేజ్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయం
()గవర్నర్ కోటాలో రాజేశ్వర్ రావు, ఫారూక్ హుస్సేన్ ఎమ్మెల్సీ