హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైడ్రా కు చట్టబద్దత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్ టిఎల్, బఫర్ జోన్ లో నిర్మాణాలను తొలగించేందుకు అధికారాలు కల్పించాం అని…ఓఆర్‌ఆర్‌కు లోపల చెరువులు, నాలాలు కబ్జాల కట్టడికి హైడ్రా కు అధికారాలు ఇచ్చామన్నారు.
హైడ్రాకు.. 150 మంది అధికారులను .. 946 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అలాట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే మూడు యూనివర్సిటీలకు పేర్లు మార్పుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చాకలీ ఐలమ్మ ఉమెన్స్ కాలేజ్, సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్శిటీ,హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు మార్చుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 60 మంది విద్యార్థులతో హ్యాండ్లూమ్ టెక్నాలజీకి ప్రారంభించాం అన్నారు.
SLBC టన్నెల్ వర్క్స్ 4,637 కోట్లకు రివైజ్డ్ ఎస్టిమేషన్ ఇచ్చాం అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రెండేళ్లలో SLBC టన్నెల్ పనులను పూర్తిచేస్తాం..సెప్టెంబర్ 2027 వరకు పూర్తిచేస్తాం అన్నారు. SLBC టన్నెల్ చారిత్రాత్మకం కానుంది..శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి డెడ్ స్టోరేజ్ నుండి కృష్ణ వాటర్ తీసుకుని అవకాశం ఉందన్నారు.డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెండింగ్ పనులను తొందరగా పూర్తిచేసేస్తాం..ప్రతినెలా 400 మీటర్లు టన్నెల్ వర్క్స్ పూర్తిచేయాలనీ లక్ష్యం పెట్టుకున్నాం అన్నారు. సన్న వడ్లకు 500 బోనస్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరి నుండి రేషన్ కార్డ్ లకు సన్న బియ్యం ఇస్తాం అన్నారు ఉత్తమ్.
Also Read:ఢిల్లీ అరవలి ఫారెస్ట్‌లో గ్రీన్ ఛాలెంజ్