Telangana Cabinet:ఉగాదికి కేబినెట్ విస్తరణ?

5
- Advertisement -

తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లనున్నారు. అధిష్టానం పెద్దలతో కీలక సమావేశం జరగనుంది. రాత్రి జరిగే ఈ సమావేశంలో కేబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఉగాదికి కేబినెట్ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణలో ఆరుగురికి అవకాశం ఉండగా ప్రస్తుతం నలుగురికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గంలో తీసుకునే వారిలో ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,జీ వివేక్, శ్రీహరి ముదిరాజ్, నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్‌రెడ్డికి చోటు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది.

లేదంటే బీసీ లేదా లంబాడ వర్గాల నుండి ఒకరి పేరును పరిశీలించే ఛాన్స్‌ ఉండగా… సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ టూర్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం వస్తుందని చాలామంది ప్రజాప్రతినిధులు భావిస్తున్న నేపథ్యంలో ఎవరికీ ఛాన్స్ దక్కుతుందో వేచిచూడాలి.

Also Read:హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ..షెడ్యూల్ రిలీజ్

- Advertisement -