TG:ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు

41
- Advertisement -

తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్​భవన్​లో నూతన మంత్రులతో గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా జి.వివేక్​ వెంటకస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్​ కుమార్​ ప్రమాణ స్వీకారం చేశారు.

నూతన మంత్రులకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ ఉపసభాపతిగా రామచంద్రనాయక్​కు అవకాశం లభించగా, సీఎం రేవంత్​ శుభాకాంక్షలు తెలియజేశారు.విస్తరణలో నలుగురికి అవకాశం కల్పించాలని తొలుత భావించారు. సుదర్శన్‌ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల పేర్లు మొదటి నుంచీ వినిపించినా, ప్రస్తుతానికి ఎస్సీ, బీసీలకు మాత్రమే అధిష్ఠానం అవకాశం ఇచ్చింది.

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి అవకాశం ఇస్తే ఆయన సోదరుడు, మంత్రి వెంకట్‌ రెడ్డిని కూడా కొనసాగించడం కష్టమని, ఇద్దరిలో ఒకరికి మాత్రమే చోటు కల్పించాల్సి ఉంటుందని అధిష్ఠానం స్పష్టం చేయడంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు తెలిసింది.

Also Read:కట్టలన్..కీలకపాత్రలో సునీల్

- Advertisement -