ఒక మంచి నాయకుడిని కోల్పోయాం:కేటీఆర్

5
- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం BRS పార్టీకి తీరని లోటు అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదారాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాగంటి ఇక లేరనే విషయం తెలియగానే ఉదయం హుటాహుటిన సతీమణి శైలిమ గారు, తన కుమారుడు హిమాన్షుతో కలిసి కేటీఆర్ ఆసుపత్రికి చేరుకున్నారు.

శోకసముద్రంలో మునిగిపోయిన మాగంటి గోపీనాథ్ కుటుంబసభ్యులను కేటీఆర్ ఓదార్చారు. మాగంటి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపిన కేటీఆర్.. ఆయన పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. సోదరుడు, మృదుస్వభావి అయిన మాగంటి గోపీనాథ్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వరుసగా మూడుసార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని, ఒక మంచి నాయకుడిని కోల్పోవడం అత్యంత బాధాకరమని కేటీఆర్ అన్నారు.

ప్రతినిత్యం ప్రజాసేవలో నిమగ్నమైన మాగంటి.. రాజకీయాల్లో హుందాతనానికి మారుపేరుగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. మాదాపూర్ లోని నివాసం నుంచి మొదలైన మాగంటి అంతిమయాత్రలో కేటీఆర్, హరీష్ రావు కలిసి పాడె మోసారు. మహా ప్రస్థానంలో జరిగిన అంత్యక్రియల్లో కేటీఆర్ తో పాటు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, మాగంటి అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలను అధికార లాంచనాలతో నిర్వహించిన ప్రభుత్వానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

Also Read:కట్టలన్..కీలకపాత్రలో సునీల్

- Advertisement -