తెలంగాణ బడ్జెట్ @రూ. 1,46,492 కోట్లు

606
kcr
- Advertisement -

2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్‌ను శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. ఆర్ధికమాంద్యం ముంచుకొస్తున్న సంక్షేమ పథకాలలో ఎలాంటి కోత విధించడం లేదన్నారు.

బడ్జెట్ హైలైట్స్‌…

-రూ. 1,46,492.3 కోట్లతో రాష్ర్ట బడ్జెట్
-రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు
-మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు
-బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు
-రాష్ర్ట ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు
-రైతుబంధు పథకానికి రూ. 12 వేల కోట్లు కేటాయింపు.
-రైతుబీమా ప్రీమియం చెల్లింపుకు రూ. 1,137 కోట్లు కేటాయింపు
-పోలీసు కమిషనరేట్ల సంఖ్యను 9కి పెంచాం.
-పోలీసు సబ్ డివిజన్ల సంఖ్యను 163కి పెంచాం.
-పోలీసు సర్కిళ్ల సంఖ్యను 717కి పెంచాం.
-పోలీసు స్టేషన్ల సంఖ్యను 814కి పెంచాం.
-గ్రామపంచాయతీలకు రూ. 2,714 కోట్లు కేటాయింపు.
-పురపాలక సంఘాలకు రూ. 1,764 కోట్లు కేటాయింపు.
-ఆరోగ్య శ్రీకి ఏడాదికి రూ. 1,336 కోట్లు.
-ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 కోట్లు కేటాయింపు.
-అభివృద్ధి, సంక్షేమం కోసం ఈ ఐదేళ్లలో రూ. 5,37,373 కోట్లు ఖర్చు.
-కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అందినవి కేవలం రూ. 31,802 కోట్లు మాత్రమే.
-రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కోసం ఇప్పటి వరకు రూ. 20,925 కోట్లు.
-ఉదయ్ పథకం ద్వారా రుణభారం రూ. 9,695 కోట్లు ప్రభుత్వమే భరించింది.
-విద్యుత్ సంస్థలకు సింగరేణి చెల్లించాల్సిన బకాయిలు రూ. 5,772 కోట్లు ప్రభుత్వమే చెల్లించింది.
-కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 1.36 శాతం మాత్రమే వృద్ధి సాధ్యమైంది.
-దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గింది.
-వాహనాల అమ్మకాలు 10.65 శాతం తగ్గాయి.
-రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయింది.
-దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం తెలంగాణపై కూడా పడింది.
-ఐటీ రంగంలో 2018-19 నాటికి 11.05 శాతం వృద్ధి రేటు సాధించాం.
-2018-19 నాటికి లక్షా 10 వేల కోట్ల ఐటీ ఎగుమతులు.
-మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించాం.

- Advertisement -