ధోనికి గౌరవ వీడ్కోలు పలకండిః అనిల్ కుంబ్లే

339
DHONI-KUMBLE

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ కోచ్ అనిల్ కుంబ్లే. ధోని వీడ్కోలుకు అన్ని విధాల అర్హుడని చెప్పారు. గౌరవ ప్రదంగా ఆయనకు వీడ్కోలు పలకవచ్చని తెలిపారు. రిటైర్మెంట్ కావాలనే నిర్ణయానికి ధోనీ వచ్చినప్పుడు… ఆయనకు గౌరవంగా వీడ్కోలు పలకాలని సూచించారు.

ధోని రిటైర్మెంట్ పై తనకు ఎలాంటి స్పష్టత లేదన్నారు. అయితే ధోని ప్లేస్ లో వచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇటీవల టీ20ల్లో నిలకడగా రాణిస్తున్నాడు. కాబట్టి.. ధోనీ భవితవ్యంపై సెలక్టర్లు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. టీ20 ప్రపంచకప్‌లో ధోనీని ఆడించాలని సెలక్టర్లు భావిస్తే అతన్ని రెగ్యులర్‌గా జట్టులోకి తీసుకుని ప్రాక్టీస్ చేయాలని పిలుపునిచ్చారు.

ఇక ధోని ఇంగ్లండ్ తో జరిగిన వరల్డ్ కప్ తర్వాత రెండు నెలల పాటు క్రికెట్ దూరంగా ఉండి ఆర్మీలో సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగే టీ20వరల్డ్ కప్ మ్యాచ్ లో ధోని ఆడతాడా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.