బీజేపీ ఒంటరి పోరు.. కలిసొస్తుందా?

35
- Advertisement -

తెలంగాణలో ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో పొత్తుల వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఏ ఏ పార్టీల మద్య దోస్తీ కుదిరే అవకాశం ఉంది. పార్టీల ఎన్నికల స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాగా అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే బరిలో నిలిచే అభ్యర్థుల ప్రకటన చేసి ఎలక్షన్ రేస్ లో దూసుకుపోతుంది. అటు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు మొదలు పెట్టాయి. కాగా అధికార బి‌ఆర్‌ఎస్ తో మజ్లిస్ పార్టీ కలిసి బరిలో దిగబోతున్నాట్లు స్పష్టమైంది. అటు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో పొత్తు కోసం అరతపడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ మరియు వామపక్షాల మద్య పొత్తు విషయం తుది అంఖానికి వచ్చినట్లు తెలుస్తోంది. .

ఇక మిగిలింది భారత జనతా పార్టీ. మరి బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకొనుంది ? అసలు పొత్తుల విషయంలో బీజేపీ వైఖరి ఏంటి అనేది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. దీనికి సంబంధించి బీజేపీ తాజాగా క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగబోతుందని.. 119 స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతే కాకుండా త్వరలోనే అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

దీంతో బీజేపీ ఒంటరి పోరుకు సిద్దమైందనేది స్పష్టంగా తెలుస్తోంది. వామపక్షాలు బీజేపీతో ఎట్టి పరిస్థితిలో కలవబోమని గతంలోనే స్పష్టం చేశాయి. అటు ఏంఐఏం కూడా బీజేపీకి మొదటి నుంచి దూరంగానే ఉంటోంది. దీంతో ఏ పార్టీ కూడా బీజేపీతో కలిసి నడవడానికి సిద్దంగా లోకపోవడంతో ఒంటరిపోరే బీజేపీకి మార్గమైంది. అయితే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉండనే వార్తలు కూడా వినిపించాయి. కానీ చివరికి టీడీపీ కూడా బీజేపీకి హ్యాండ్ ఇచ్చి ఒంటరిగా బరిలోకి దిగబోతున్నాట్లు స్పష్టం చేసింది. దీంతో ఇంక చేసేదేమీ లేక సిగిల్ గా బరిలోకి దిగుతున్న కాషాయ పార్టీకి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.

Also Read:Allu Arjun:పుష్ప 2 సెట్స్‌.. వీడియో వైరల్

- Advertisement -