పరిస్థితులు ఎలా ఉన్న తమకు అనుకూలంగా మార్చుకోవడం కమలనాథులకు అందె వేసిన చేయి అని చెప్పక తప్పదు. పార్టీ పై తీవ్రమైన వ్యతిరేకత పెరిగిన ప్రతిసారి జాతీయ వాదాన్ని తెరపైకి తెచ్చి ప్రజా వ్యతిరేకతను తప్పుదోవ పట్టిస్తుంటారు బీజేపీ నేతలు. ప్రస్తుతం దేశంలో మణిపూర్ అల్లర్లు, రైతు వ్యతిరేక చట్టాలు, నిత్యవసర ధరల పెరుగుదల వంటి చాలా అంశాలాపి వ్యతిరేక గళం వినిపిస్తోంది. మరి ముఖ్యంగా ఈ మద్య దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన మణిపూర్ అల్లర్ల విషయంలో మోడి ప్రభుత్వంపై స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దీని నుంచి ప్రజల ధృష్టి మళ్లించేందుకు జాతీయ వాదాన్ని మరోసారి తెరపైకి తెస్తోంది..
మరో వారంలో స్వాతంత్ర్య దినోత్సవం ఉన్న నేపథ్యంలో ” మేర దేశ్ – మేర మిట్టి ” ( నేను పుట్టిన నేల ననుగన్న దేశం ) అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున యువత ను ఆకర్షించే ప్లాన్ లో ఉంది కమలం పార్టీ. ఎందుకంటే జాతీయ వాదానికి యువత పెద్దఎత్తున ఆకర్షితులౌతారు. అలాగే ఈసారి యువ ఓటర్ల సంఖ్యకూడా అధికంగానే ఉంది. అందుకే యువత ను ధృష్టిలో ఉంచుకొని బీజేపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది.
Also Read:ఏపీలో ‘చిరు’ మంట..వ్యూహమేనా?
ముఖ్యంగా తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు బీజేపీ నేతలు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ కొంత స్లో అయింది. ఇప్పుడు ఈ ” మేరా దేశ్ – మేరా మిట్టి ” కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళితే అదే జోష్ ను ఎన్నికల వరకు కొనసాగించ వచ్చనే ఆలోచనలో రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధిష్టానం అధెశాల మేరకు ఈ కార్యక్రమ నిర్వహణపై తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వర్క్ షాప్ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అన్నీ వర్గాల ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. మరి జాతీయవాదంతో బీజేపీ వేస్తున్న ప్లాన్స్ ఎంతవరుకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
Also Read:వావ్.. ఎన్టీఆర్ న్యూ లుక్ అదిరింది