బీజేపీకి ఈసీ షాక్‌ ఎందుకో తెలుసా…

36
cec
- Advertisement -

భార‌తీయ జ‌న‌తా పార్టీకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం షాకిచ్చింది. తెలంగాణ ముఖ్య‌మంత్రికి వ్య‌తిరేకంగా బీజేపీ మొద‌లు పెట్టిన ప్ర‌చారాన్ని నిలిపి వేయాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. సాలు దొర – సెల‌వు దొర ప్ర‌చారంపై ఈసీ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా సాలు దొర – సెల‌వు దొర అంటూ ఆయ‌న బొమ్మ‌తో పోస్ట‌ర్లు ముద్రించొద్ద‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశించింది. ఆ పోస్ట‌ర్ల ముద్ర‌ణ‌కు సంబంధించిన అనుమ‌తిని ఈసీ నిరాక‌రించింది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కించపరిచే విధంగా పోస్టర్లు, ఫోటోలు, రాతలు ఉండకూడదని ఎన్నికల కమిషన్ ఖ‌రాఖండీగా చెప్పింది. సాలు దొర – సెలవు దొర క్యాంపెయిన్‌కు ఎన్నికల కమిషన్ మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనుమతి నిరాక‌రించింది. 2019 ఎన్నికలకు ముందు సుప్రీం కోర్టు ఆదేశాలతో మీడియా సర్టిఫికేషన్ కమిటీని ఎన్నిక‌ల సంఘం ఏర్పాటు చేసింది.

- Advertisement -