ఈటల సహా బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..

91
bjp
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. మంత్రి హరీష్ రావు 3వ సారి బడ్జెట్ ప్రవేశ పెడుతుండగా ఆయన ప్రసంగానికి అడ్డుతగిలిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌ను సభ నుండి సస్పెండ్ చేశారు. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు వీరిపై సస్పెన్షన్ కొనసాగనుంది.

తెలంగాణ ఆవిర్భావం నుండి కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు హరీష్. ప్రగతిశీల రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. కేంద్రం తీరుపై బడ్జెట్‌లో విమర్శలు చేసిన హరీష్…సీఎం కేసీఆర్ రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషిచేస్తున్నారని తెలిపారు. ఈ బడ్జెట్‌తో తెలంగాణ ప్రజల జీవితాలు మారుతాయన్నారు.

తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా మారుతోందన్నారు హరీష్. 2 లక్షల 56 వేల 958 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఇందులో దళితబంధు కోసం రూ.17 వేల కోట్లు కేటాయించారు.11800 మంది దళిత కుటుంబాలకు దీని ద్వారా లబ్దిచేకూరనుంది.

- Advertisement -