బీజేపీలో ఉండలేం.. బాబోయ్?

31
- Advertisement -

తెలంగాణ బీజేపీలో అసంతృప్త జ్వాలలు ఆగడం లేదు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉన్న కాషాయ పార్టీలో ఎప్పటికప్పుడు అసమ్మతి ద్వనులు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి.. తెలంగాణలో బాగానే ఎఫెక్ట్ చూపిస్తోందనే చెప్పవచ్చు. అంతకు ముందు బి‌ఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని చంకలు గుద్దుకున్న కమలనాథులు. ఆ ఓటమి తరువాత సందిగ్ధంలోకి వెళ్ళిపోయారు. ఫలితంగా పార్టీ పరిస్థితులను చక్కదిద్దెందుకు స్వయంగా అధిష్టానమే రంగంలోకి దిగి కీలక మార్పులు చేసింది. అయినప్పటికి అడపా దడపా అసంతృప్త నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. .

దానికి తోడు కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో బి‌ఆర్‌ఎస్ తరువాతి స్థానం కూడా బీజేపీ చేజార్చుకునే అవకాశం కనిపిస్తోంది. దాంతో ఓడిపోయే పార్టీలో ఉండే కన్నా ఇతర పార్టీల పక్షాన చేరడం మేలని ఆ పార్టీలోని మెజారిటీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో కొందరు సీనియర్ నేతలకు ప్రదాన్యత తగ్గడంతో వారంతా కమలం పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి. మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ వంటి వారు ఏ క్షణంలోనైనా పార్టీ నుంచి బయటకు వెళ్ళేందుకు సిద్దంగా ఉన్నారట. కుదిరితే అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ లేదంటే కాంగ్రెస్ పక్షాన చేరేందుకు మార్గం వెతుక్కుంతున్నట్లు టాక్. ఇదే గనుక నిజం అయితే పార్టీలో ప్రదాన్యత లేని నేతలు చాలానే ఉన్నారు. వారంతా కూడా బయటకు వచ్చిన ఆశ్చర్యం లేదనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట. మరి బీజేపీలో మార్పులు చేసినప్పటికి పార్టీలో లొసుగులు మాత్రం తగ్గడం లేదు. మరి కాషాయ అధిష్టానం నేతలు బయటకు వెళ్లకుండా ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో చూడాలి.

Also Read:ఉడకబెట్టిన శనగలు తినడం మంచిదే.. కానీ!

- Advertisement -