జనసేనకు బీజేపీ మొండి చేయి?

42
- Advertisement -

తెలంగాణలో జనసేనతో కలిసి ఎన్నికల బరిలో ఉండబోతున్నట్లు బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సీట్ల విషయంలో రెండు పార్టీల మద్య చిచ్చు మొదలైనట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేయాలని మొదట నిర్ణయించుకుంది. కానీ అనూహ్యంగా కాషాయ పార్టీ దోస్తీ కోరడంతో జనసేన పోటీ చేసే స్థానాల పై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే మూడు దశల్లో అభ్యర్థులను ప్రకటించిన కాషాయ పార్టీ మొత్తం 88 మంది అభ్యర్థులను ఆల్రెడీ ప్రకటించింది. మిగిలిన స్థానాల్లో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై ముమ్మర కసరత్తులు చేశారు కమలనాథులు. కాగా జనసేన 20 నుంచి 25 సీట్లను డిమాండ్ చేయడంతో కాషాయ పార్టీ కాస్త వెనక్కి జంకుతూ వచ్చింది.

ఇక తాజాగా 12 మంది అభ్యర్థులను ప్రకటిస్తూ నాలుగో జాబితాను కూడా విడుదల చేసింది బీజేపీ. ఈ నాలుగో జాబితాలో కూడా జనసేన ప్రస్తావన లేదు. దీంతో దీంతో జెఎస్పి విషయంలో బీజేపీ వెనకడుగు వేస్తోందా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకు 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ 19 స్థానాలను మాత్రం ఇంకా హోల్డ్ లో పెట్టింది. ఈ స్థానాలను జనసేన కోసమే నిర్ణయించబోతుందా ? అనే అభిప్రాయాలూ కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే జనసేన కోరిన సీట్లను కాకుండా బీజేపీ వేరే ఇతర సీట్లను కేటాయించే ప్లాన్ లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ 19 స్థానలో కూడా జనసేనకు 9 సీట్లు. మిగిలిన పది స్థానాల్లో బీజేపీనే బరిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో వినికిడి. మరి బీజేపీ సీట్ల సర్దుబాటు విషయంలో పవన్ ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకమే. మొత్తానికి జనసేనతో పొత్తు ప్రకటించినప్పటికీ బీజేపీ మాత్రం సీట్ల కేటాయింపులో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లే కనిపిస్తోంది.

Also Read:టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం

- Advertisement -