టీబీజేపీ అధ్యక్ష రేసు..ఈటలకు పొగబెడుతున్న బండి?

15
- Advertisement -

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరవుతారా అని ఆ పార్టీ కార్యకర్తలు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీజేపీ అధ్యక్ష ఎన్నిక త్వరలో ఉంటుందని ప్రకటించి చాలా రోజులు గడుస్తున్న కాషాయ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. దీనికి కారణం నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడమే.

ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశీస్తున్న వారిలో ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామ్‌చందర్ రావు ఉన్నారు. ఇక మొదటి నుండి పార్టీకి సేవలు అందిస్తున్న రామ్‌చందర్‌రావు వైపే మెజార్టీ నేతలు ఉన్నారట. అయితే ఈటల మాత్రం ఢిల్లీ లెవల్లో ప్రయత్నాలు చేస్తున్నారు.

దీంతో ఈటలకు బీజేపీ అధ్యక్ష పదవి రాకుండ రంగంలోకి దిగారు కేంద్రమంత్రి బండి సంజయ్‌. ఈటెలకు పోటీగా రాంచందర్ రావుకు మద్దతిస్తూ కుర్చీ తన వాళ్లకు ఇప్పించడానికి బండి సంజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అధిష్టానానికి ఫిర్యాదు చేసి తనను తప్పుకునేలా చేయడాన్ని మనసులో పెట్టుకున్నారు బండి. దీనికి ప్రధాన కారణం పరోక్షంగా ఈటలనే అని చెప్పారు కూడా.

ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణమ క్రమం నేపథ్యంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇద్దరూ ఎంపీలుగా గెలవగా బండికి కేంద్రమంత్రి పదవి దక్కింది. దీంతో ఇప్పుడు దీనిని ఉపయోగించి ఈటలకు పార్టీ అధ్యక్ష పదవి రాకుండా శతవిధాలా ప్రయత్నిస్తున్నారట బండి. మొత్తంగా మరోసారి బండి వర్సెస్ ఈటల వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Also Read:కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కలెక్షన్‌:ఎర్రోళ్ల

- Advertisement -