TS BJP:ఈటల వర్సెస్ జితేందర్ రెడ్డి

58
- Advertisement -

తెలంగాణ బీజేపీ సంక్షోభంలో పడింది. మొన్నటివరకు జోష్ మీదున్న నేతలు ఒక్కసారిగా డీలా పడిపోయారు. సీనియర్ నేతలు అసమ్మతి రాగం ఎంచుకోగా మరికొంతమంది పార్టీ అధ్యక్షుడి మార్పుకోసం పట్టుబడుతున్నారు. దీంతో ఇప్పుడు బీజేపీలో చేరిన నేతలంతా అయోమయస్థితిలో పడిపోయారు.

ఇక తాజాగా బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్‌ ఆ పార్టీ నేతలను మరింత ఇబ్బందులకు గురిచేసింది. దీంతో జితేందర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని.. ఏదీ పడితే అది మాట్లాడకూడదన్నారు. ఎవరి గౌరవానికీ భంగం కలగకుండా చూసుకోవాలన్నారు. ఎవరి స్వేచ్ఛ, గౌరవం తగ్గించకూడదని…జితేందర్ రెడ్డి ఎందుకు ట్వీట్ చేశారో.. ఆయన ఉద్దేశ్యం ఏంటో ఆయననే అడగాలన్నారు.

Also Read:అల్లరి నరేష్ కీలక నిర్ణయం

ఓ వ్యక్తి దున్నపోతును ట్రాలీలో ఎక్కించడానికి ట్రై చేస్తుంటాడు. అది ఎక్కకుంటే వాటి సీటుపై ఒక్క తన్ను తంతాడు. వెంటనే అది ట్రాలీ ఎక్కుతుంది. సేమ్ టు సేమ్ ట్రీట్‌మెంట్ తెలంగాణ బీజేపీ నాయకత్వానికి కూడా అవసరమని జితేందర్ రెడ్డి పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌ను అమిత్‌ షా, బీఎల్‌ సంతోష్‌, సునీల్‌ బన్సాల్‌ వంటి అగ్రనేతలకు ట్యాగ్‌ చేయగా అది కొద్దిసేపట్లోనే వైరల్‌గా మారింది. ఇక ఈటల వ్యాఖ్యలపై జితేందర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి..

Also Read:HarishRao:పోడు పట్టాలను పంచిన మంత్రి..

- Advertisement -