నయా భారత్‌ … ఈ ద్వంద్వ వైఖరి ఏంది..?

483
telangana bjp
- Advertisement -

3ఏ రోటి కాడ ఆ పాట పాడటమంటే ఇదేనేమో! ..ఒకే దేశం-ఒకే చట్టం-ఒకే ప్రజా అంటూ గొప్పలు చెప్పే బీజేపీ నేతలు తాము అవలంభిస్తున్న విధానాలతో నవ్వుల పాలవుతున్నారు. తెలంగాణ కొత్త సచివాలయం,అసెంబ్లీ భవనాల నిర్మాణాలను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు బీజేపీ నేతలు. గోబెల్స్ ప్రచారానికి తెరలేపుతూ చారిత్రక కట్టడాలను కూల్చివేస్తారా,ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు అంటూ వింత వాదనను తెరమీదకు తీసుకువచ్చారు.

తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్టూ తెలంగాణ కొత్త అసెంబ్లీపై గోబెల్స్‌ ప్రచారానికి తెరలేపిన కొద్దిరోజుల్లోనే చిక్కుల్లో పడ్డారు బీజేపీ నేతలు. పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంగా కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నామని ప్రకటించారు స్పీకర్ ఓం బిర్లా.

ప్రస్తుతమున్న పార్లమెంట్ భవనం స్ధానంలో మరొకొత్త ,అత్యాధునిక హంగులతో భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. దీంతో ఎరక్కపోయి ఇరుకున పడ్డారు బీజేపీ నేతలు. తెలంగాణ అసెంబ్లీ కొత్త భవనం నిర్మాణం సందర్భంగా బీజేపీ నేతలు లేవనెత్తిన ప్రశ్నలన్నింటిని గుర్తు చేస్తున్నారు ప్రజలు. తెలంగాణలో కొత్త అసెంబ్లీ కడితే ప్రజా ధనం దుర్వినియోగం అని మాట్లాడిన నేతలు ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త పార్లమెంట్ వల్ల దేశ సంపద వృదా కాదా..?దేశ ఖజానాకు భారం కాదా..? మరికొద్దిరోజుల్లో పార్లమెంట్ భవనం కట్టి వంద సంవత్సరాలు కావొస్తున్న తరుణంలో చారిత్రక పార్లమెంట్ భవనాన్ని ఎలా కూల్చివేస్తారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఇక నిజామాబాద్‌ పసుపు బోర్డు అంశంలోనూ మాటమార్చారు బీజేపీ నేతలు. ఎంపీగా గెలిస్తే వారం రోజుల్లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని లేకుంటే రాజీనామా చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చిన ధర్మపురి అరవింద్,బీజేపీ జాతీయ నేతలు కనీసం మాటైనా మాట్లాడటం లేదు. పైగా కొత్త వాదన తెరమీదకు తీసుకువచ్చారు. పుసుపుబోర్డును రైతులే వద్దంటున్నారు…?కేవలం మద్దతు ధర ఇస్తే చాలని చెబుతున్నారని ప్రచారం చేస్తున్నారు. దీంతో రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఒకే దేశం- ఒకే విధానం అంటూ మాటలు చెప్పే నేతలు ఈ ద్వంద్వ వైఖరి అవలంబించడం పట్ల తెలంగాణ ప్రజల నుంచి అసహనం వ్యక్తమవుతోంది.

- Advertisement -