Telangana BJP:బీజేపీ లిస్ట్ రెడీ.. ?

50
- Advertisement -

కర్నాటక ఎన్నికల తరువాత తెలంగాణలో బీజేపీ కొంత డల్ అయిందనే చెప్పాలి. గతంలో ఉన్న దూకుడు ప్రస్తుతం పార్టీలో కనిపించడం లేదు. దానికి తోడు ఇటీవల పార్టీలో పలు పదవుల విషయంలో మార్పులు చోటు చేసుకోవడం కూడా ఆ పార్టీ స్లో అవ్వడానికి మరో కారణం. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి గట్టి దెబ్బ తగిలే ప్రమాదం ఉందని గ్రహించిన పార్టీ అధిష్టానం.. నేతల్లో జోష్ నింపేందుకు ప్రణాళికలు రచిస్తోంది..

ఈ నెల 27న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నట్లు సమాచారం. అమిత్ షా రాక సందర్భంగా ఎన్నికల బరిలో నిలిచే మొదటి జాబితా అభ్యర్థుల లిస్ట్ ను తెలంగాణ బీజేపీ రెడీ చేస్తున్నట్లు టాక్. అభ్యర్థుల ఎంపిక కూడా అమిత్ షా సూచనల మేరకే జరుగుతున్నట్లు టాక్. నియోజిక వర్గాల వారీగా ఇప్పటికే సర్వేలు చేయించిన అమిత్ షా.. ఎవరెవరికి సీట్లు కేటాయించాలనే దానిపై రాష్ట్ర నేతలకు క్రియర్ కట్ ఆదేశాలు జారీ చేశారట. షా సూచనల మేరకే లిస్ట్ రెడీ చేసిన కమలనాథులు 27 న ఆ లిస్ట్ ను ఆయన ముందుంచే అవకాశం ఉందట. తొలి జాభితలో భాగంగా 35 మంది గెలుపు గుర్రాలను బహిర్గతం చేసేలా కాషాయ దళం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

హిందుత్వవాదాన్నే నమ్ముకున్న బీజేపీ.. నియోజిక వర్గాల వారీగా హిందూ ఓటర్లను ప్రభావితం చేసేలా లిస్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. మొదటి జాబితా అభ్యర్థుల ప్రకటనతో అన్నీ నియోజిక వర్గాలలోని నేతలల్లో, కార్యకర్తలలో జోష్ పెరిగే అవకాశం ఉందని.. ఆ జోష్ తో అందరూ ఎలక్షన్ మూడ్ లొకి వస్తారని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. కాగా మరోవైపు బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపిక పై ముమ్మర కసరత్తులు జరుపుతున్నాయి. ఆ రెండు పార్టీలకు పోటీనిచ్చే ధీటైన అభ్యర్థుల ఎంపిక కాషాయ పార్టీ ఎలా చేస్తుందో చూడాలి.

Also Read:కర్నాటకలో కాంగ్రెస్ ఢమాల్..హింట్ ఇచ్చిన బీజేపీ!

- Advertisement -