తెలంగాణలో భారీ వర్షాలు : వాతావరణ శాఖ

59
rains
- Advertisement -

వాయువ్యబంగాళాఖాతం మరియు దాని పరిసరాలలో ఉన్న ఆవర్తనం ఈ రోజు ఉత్తర ఒడిశాను ఆనుకుని, ఛత్తీస్‌గఢ్ పరిసరాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంటుందని తెలిపింది. ఈస్ట్‌వెస్ట్ జోన్ 20°N వెంబడి సగటు సముద్రం మట్టంకి 3.1 కి.మీ & 5.8 కి.మీ మధ్య ఉత్తర ద్వీపకల్ప భారతదేశం అంతటా ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణం వైపుకి ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈరోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షములు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో భారీ వర్షములుతో పాటు అతిభారీ వర్షములు కురుస్తాయని, ఉరుములు మరియు మెరుపులుతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాలలో పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -