ఈ నెల 7న ఆటోల బంద్

4
- Advertisement -

ఉచిత బస్సు పథకంతో తాము నష్టపోతున్నామని, పెండింగ్లో ఉన్న తమ సమస్యలకు పరిష్కారం చూపాలని ఈ నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్‌కు పిలుపునిచ్చారు. అలాగే ఇందిరాపార్క్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆటో డ్రైవర్లు తెలిపారు.

కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఫ్రీ బస్ పథకంపై ఆటో డ్రైవర్లు ఆగ్రహంతో ఉన్నారు. ఉచిత బస్సు పథకంతో ఉపాధి కొల్పోయామని సీఎం రేవంత్ రెడ్డికి సైతం తమ సమస్యలను విన్నవించారు. ఫ్రీ బస్ పథకం వల్ల వందలాది మంది ఆటో డ్రైవర్లు చనిపోయారని…తమను ఆదుకోవాలని కోరినా లాభం లేకుండా పోయింది. దీంతో దశల వారీగా ఆందోళన చేస్తూ వస్తున్న ఆటో డ్రైవర్లు ఈ నెల 7న బంద్‌కు పిలుపునిచ్చారు.

Also Read:నారా లోకేశ్‌ ప్రజాదర్బార్‌కు అనూహ్య స్పందన

- Advertisement -