రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో మొదలు కానున్నాయి. ఉదయం పది గంటలకు అసెంబ్లీ హాలులో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. అసెంబ్లీ ప్రాంగణంలో గవర్నర్‌కు శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వేదాంత నరసింహాచార్యులు స్వాగతం పలుకుతారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం ఉభయసభలు వాయిదా పడుతాయి.తర్వాత శాసనమండలి, శాసనసభల బీఏసీ సమావేశాలు జరగనున్నాయి. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల షెడ్యూలు ఖరారు కానుంది.
బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, సమయం, ఏయే రోజుల్లో సమావేశాలకు సెలవు ఇవ్వాలి, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయసభల్లో ఎన్ని రోజులు చర్చ జరగాలి, బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టాలి, బడ్జెట్‌పై ఎన్ని రోజులు చర్చ జరగాలి.. వంటి అంశాలపై నిర్ణయం తీసుకొంటారు. ఈ నిర్ణయాల మేరకు మంగళవారం నుంచి ఉభయసభల సమావేశాలు కొనసాగుతాయి.ఈ నెల 15 న బడ్జెట్ ప్రతిపాదనలను ఉభయ సభల్లోనూ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే పూర్తిస్థాయి చివరి బడ్జెట్. ఇరిగేషన్ తో పాటు సంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు కేటాయిస్తారని తెలుస్తోంది.